AP HC on Volunteers : వాలంటీర్ల చట్టబద్దతను ప్రశ్నించిన జస్టిస్ దేవానంద్-andhra pradesh high court questions constitutional validity of volunteers for implementing welfare schemes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh High Court Questions Constitutional Validity Of Volunteers For Implementing Welfare Schemes

AP HC on Volunteers : వాలంటీర్ల చట్టబద్దతను ప్రశ్నించిన జస్టిస్ దేవానంద్

HT Telugu Desk HT Telugu
Feb 22, 2023 08:17 AM IST

AP HC on Volunteers ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు కోసం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వాలంటీర్ల పాత్ర ఏమిటో తేల్చాలని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ పథకాల లబ్దిదారులను గుర్తించడంలో వాలంటీర్లు నిర్వహిస్తున్న పాత్రపై స్పష్టతనిచ్చేందుకు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని జస్టిస్ బట్టు దేవానంద్

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

AP HC on Volunteers ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల గుర్తింపులో వాలంటీర్ల పాత్ర ఏమిటనే విషయంలో స్పష్టత ఇచ్చేందుకు ఫిబ్రవరి 28న హైకోర్టు ఎదుట చారణకు హాజరుకావాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ను ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

ఏపీ ప్రభుత్వం అమలుచ చేస్తు్న వైఎస్సార్ చేయూత పథకం కింద గతంలో లబ్ధి పొందినా.. రాజకీయ కారణాలతో అర్హుల జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్‌.వసంతలక్ష్మితో పాటు మరో 26 మంది హైకోర్టును ఆశ్రయించారు.

గ్రామస్థాయి లబ్ధిదారులను గతంలో పంచాయతీ కార్యదర్శి గుర్తించేవారని, ప్రస్తుతం వాలంటీర్లు రాజకీయ కారణాలతో అన్ని అర్హతలు ఉన్న వారిని కూడా అనర్హులను చేస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల ఆరోపణలపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, అర్హతను నిర్ణయించే అధికారం వాలంటీర్లకు ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వ శాఖలు, అధికారులు ఉన్నప్పుడు వాలంటీర్లను ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించారు.

వాలంటీర్లకు సర్వీసు నిబంధనల్లేవు. వాలంటీర్ వ్యవస్థకు ఉన్న చట్టబద్ధత ఏమిటి అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు 'లబ్ధిదారులను గుర్తించడంలో వాలంటీర్ల పాత్ర లేదని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. సెర్ప్‌ సీఈవో మాత్రం అందుకు భిన్నంగా కౌంటర్‌ వేయడాన్ని గుర్తించారు.

ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లబ్ధిదారులను గుర్తించేందుకు వాలంటీర్లను వినియోగిస్తున్నామని, ఇందుకు ఆరు అంచెల విధానాన్ని అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల పాత్రపై స్పష్టత ఇచ్చేందుకు సెర్ప్‌ సీఈవో 28న స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థకు పోటీగా కొత్త వారిని నియమిస్తామని ఇప్పటికే ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం 50ఇళ్లకు ఓ వాలంటీర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, కుటుంబ సారథి పేరుతో టీడీపీ 30ఇళ్లకు ఒకరిని నియమిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ చట్టబద్దతను న్యాయస్థానం ప్రశ్నించడం కీలకంగా మారింది.

IPL_Entry_Point

టాపిక్