Ysrcp Incharges Second List : వారసులకు సీట్లు- 27 మందితో వైసీపీ ఇన్ ఛార్జ్ ల రెండో జాబితా విడుదల-amaravati news in telugu ysrcp incharge second list released 27 members appointed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Incharges Second List : వారసులకు సీట్లు- 27 మందితో వైసీపీ ఇన్ ఛార్జ్ ల రెండో జాబితా విడుదల

Ysrcp Incharges Second List : వారసులకు సీట్లు- 27 మందితో వైసీపీ ఇన్ ఛార్జ్ ల రెండో జాబితా విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Jan 02, 2024 09:55 PM IST

Ysrcp Incharges Second List : వైసీపీ అధిష్టానం నియోజకవర్గాల సమన్వయ కర్తల రెండో జాబితాను విడుద చేసింది. మొత్తం 27 మందిని ఇన్ ఛార్జ్ లుగా నియమించింది.

వైసీపీ రెండో జాబితా
వైసీపీ రెండో జాబితా

Ysrcp Incharges Second List : వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు చేర్పులు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ నియోజకవర్గాల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది ఇన్ ఛార్జ్ లో రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయ ణ ప్రటించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ 27 మందిని నియోజకవర్గాల సమన్వయ కర్తలుగా నియమిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సామాజిక సమీకరణాలతో రెండో జాబితా రూపొందించినట్లు తెలిపారు. రెండో జాబితాలో పలువురు నేతలకి స్థానచలనం జరిగింది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జ్ ల బాధ్యతలు అప్పగించారు. రెండో జాబితాలో ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. వైసీపీ కీలక నేతల వారసులైన.. పేర్ని కృష్ణ మూర్తి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, పిల్లి సూర్య ప్రకాష్ లకు బాధ్యతలు అప్పగించారు.

కొత్త ఇన్ ఛార్జ్ లు

  • అనంతపురం ఎంపీ- మాలగుండ్ల శంకరనారాయణ
  • హిందూపురం ఎంపీ - జోలదరాశి శాంత
  • అరకు ఎంపీ (ఎస్టీ)- కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి
  • రాజాం (ఎస్సీ)- తాలె రాజేష్
  • అనకాపల్లి- మలసాల భరత్ కుమార్
  • పాయకరావుపేట (ఎస్సీ) - కంబాల జోగులు
  • రామచంద్రాపురం- పిల్లి సూర్యప్రకాష్
  • పి.గన్నవరం (ఎస్సీ)- విప్పర్తి వేణుగోపాల్
  • పిఠాపురం- వంగ గీత
  • జగ్గంపేట -తోట నరసింహం
  • ప్రత్తిపాడు-వరుపుల సుబ్బారావు
  • రాజమండ్రి సిటీ- మార్గాని భరత్
  • రాజమండ్రి రూరల్- చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
  • పోలవరం (ఎస్టీ)- తెల్లం రాజ్యలక్ష్మి
  • కదిరి- బి. ఎస్. మక్బూల్ అహ్మద్
  • ఎర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్
  • ఎమ్మిగనూర్- మాచాని వెంకటేష్
  • తిరుపతి- భూమన అభినయ్ రెడ్డి
  • గుంటూరు ఈస్ట్- షేక్ నూరి ఫాతిమా
  • మచిలీపట్నం- పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
  • చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  • పెనుకొండ- కె.వి. ఉషా శ్రీచరణ్
  • కళ్యాణదుర్గం - తలారి రంగయ్య
  • అరకు (ఎస్టీ) -గొడ్డేటి మాధవి
  • పాడేరు (ఎస్టీ)- మత్స్యరాస విశ్వేశ్వర రాజు
  • విజయవాడ సెంట్రల్ - వెలంపల్లి శ్రీనివాస రావు
  • విజయవాడ వెస్ట్- షేక్ ఆసిఫ్

మార్పుచేర్పులు

మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తికి మచిలీపట్నం బాధ్యతలు అప్పగించారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్ ను రామచంద్రాపురం ఇన్ ఛార్జ్ గా నియమించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చంద్రగిరి బాధ్యతలు అప్పగించారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడి భూమన అభినయ్ రెడ్డికి తిరుపతి వైసీపీ బాధ్యతలు అప్పగించారు. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం ఇన్ ఛార్జ్ గా నియమించారు. ఈసారి ఆమెను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ కు మార్చారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రి రూరల్ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మంత్రి ఉషా శ్రీ చరణ్ ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు మార్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా మార్చారు. జగ్గంపేట ఇన్ ఛార్జ్ గా మాజీ ఎంపీ తోట నరసింహంను నియమించారు.

Whats_app_banner