AP Marriage Registration Fee : కొత్త జంటలకు ఏపీ సర్కార్ షాక్, వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు-amaravati news in telugu ap govt hike marriage registration fees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Marriage Registration Fee : కొత్త జంటలకు ఏపీ సర్కార్ షాక్, వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

AP Marriage Registration Fee : కొత్త జంటలకు ఏపీ సర్కార్ షాక్, వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

Bandaru Satyaprasad HT Telugu
Jan 23, 2024 02:45 PM IST

AP Marriage Registration Fee : ఏపీలో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ల ఫీజులు పెరిగాయి. వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు
వివాహ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు (pexels)

AP Marriage Registration Fee : మరో నెల రోజుల్లో వివాహ ముహూర్తాలు మొదలవుతాయి. వరుసగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ల ఫీజులను ఏపీ ప్రభుత్వం సవరించింది. వివాహాల నమోదుకు సంబంధించి ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వివాహ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.200 ఉండగా, దానిని రూ.500కు పెంచింది. వివాహ వేదిక వద్దకు సబ్ రిజిస్ట్రార్ వస్తే ఇప్పటివరకు ఉన్న రూ.210 ఫీజును అమాంతం రూ.5 వేలకు పెంచింది. ప్రస్తుత ఏడాదిలో వివాహాల రికార్డుల పరిశీలనకు రూపాయిగా ఉన్న ఫీజును రూ.100లకు పెంచింది. సెలవు రోజుల్లో వివాహాల నమోదుకు ఫీజును రూ.5 వేలు చేసింది. ఇందుకు గానూ 1955 హిందూ వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టానికి సంబంధించి 1965లో జారీచేసిన ఫీజులను సవరిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజులు పెంచినప్పటికీ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివాహ రిజిస్ట్రేషన్లను మరింత సులభం చేస్తున్నట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌ కోసం ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.

వివాహ రిజిస్ట్రేషన్లు సులభతరం

ఫీజులు పెంచినప్పటికీ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వివాహ రిజిస్ట్రేషన్లను మరింత సులభం చేస్తున్నట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌ కోసం ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో వివాహ రిజిస్ట్రేషన్లు అమలు చేస్తుండగా, త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకూ హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాన్యువల్‌గా రిజిస్టర్‌ చేస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ కు పెళ్లిఫొటోలు, పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఆధార్‌ కార్డ్‌లు, ముగ్గురు సాక్షులతో రిజిస్ట్రేషన్‌ చేసుకునేవాళ్లు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు ఓ ఫామ్‌ పూర్తి చేసి సబ్‌ రిజిస్ట్రార్‌కు అందజేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆ వివరాలు సరిచూసి పుస్తకంలో నమోదు చేస్తారు. ఆ తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇకపై ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో అమలు చేయనున్నారు. www.registrations.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఇలా?

ఈ వెబ్ సైట్ లో మొబైల్ నెంబర్ లేదా ఈ-మెయిల్ తో లాగిన్ అయ్యిందుకు అవకాశం కల్పించారు. అనంతరం ఆన్‌లైన్‌లో వివాహ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఫామ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురి ఆధార్‌ కార్డ్‌లు, పెళ్లి ఫొటోలు, పదో తరగతి సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ ముందు హాజరుకావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తును సబ్‌ రిజిస్ట్రార్‌ అందజేస్తే, దానిని పరిశీలించి సాక్షుల సంతకాల అనంతరం మ్యారేజ్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. హిందూ వివాహ ప్రకారం కాకుండా జరిగిన వివాహనాలను ప్రత్యేక వివాహాల కింద రిజిస్ట్రేషన్ చేస్తారు. వాటికి కూడా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

Whats_app_banner