AP PGECET Results 2024 : ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
AP PGECET Results 2024 : ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx లింక్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
AP PGECET Results 2024 : ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ పీజీఈసెట్) -2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ పీజీ ఈసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్సీహెచ్ఈ) మంగళవారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ects.apsche.ap.gov.in లో చూడొచ్చు. అనంతరం ర్యాంక్ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీఎస్సీహెచ్ఈ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ పర్యవేక్షణలో ఏపీ పీజీఈసెట్ పరీక్షలు జరిగాయి. ఎంఈ, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ( ఎంటెక్ ) మాస్టర్ ఆఫ్ ఫార్మసీ( ఎం ఫార్మసీ) డిప్లమో ఇన్ ఫార్మసీ డీఫార్మసీ) కోర్సులకు ఈ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ కోర్సుల్లో జియో ఇంజినీరింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెటలర్జీ, కెమికల్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ వంటి 13 విభాగాలకు పరీక్షలు జరిగాయి.
ఏపీ పీజీఈసెట్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 17 వెలువడింది. పరీక్షలు మే 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు జరిగాయి. ఆనర్స్ కీ జూన్ 1 విడుదల చేశారు. ఆన్సర్ కీ సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూన్ 3 సాయంత్రం 5 గంటల లోపు సంప్రదించవచ్చని ఏపీఎస్ సీహెచ్ఈ తెలిపింది. వాటికి సంబంధించిన ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి.
ఫలితాలు ఎలా చూడాలి?
- ఏపీ పీజీఈసెట్ ఫలితాలను చూడాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx లోకి వెళ్లాలి.
- హోంపేజీలో డౌన్లోడ్ ర్యాంక్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత పేజీలో పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ నంబర్ , పీజీఈసెట్ హాల్ టిక్కెట్టు నంబర్ ఎంటర్ చేయాలి.
- అనంతరం వ్యూ రిజల్ట్ ను క్లిక్ చేయాలి. ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ఆ తరువాత ర్యాంక్ కార్డుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించారు. తాజాగా వీటి ఫలితాలు విద్యాశాఖ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జేఎన్‌టీయూహెచ్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్ ఆచార్య లింబాద్రి పీజీఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20,626 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పీజీఈసెట్ లో మొత్తం మార్కుల్లో కనీసం 25 శాతం మార్కులు వచ్చిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులకు కనీస అర్హత మార్కులు ఉండవు. వచ్చిన మార్కులు ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం