AP Haj Tour Notification: ఏపీ నుంచి హజ్ యాత్రకు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం, ఆన్‌లైన్‌లో స్వీకరణ-acceptance of applications for hajj yatra from ap has started online applications ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Haj Tour Notification: ఏపీ నుంచి హజ్ యాత్రకు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం, ఆన్‌లైన్‌లో స్వీకరణ

AP Haj Tour Notification: ఏపీ నుంచి హజ్ యాత్రకు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం, ఆన్‌లైన్‌లో స్వీకరణ

Sarath chandra.B HT Telugu
Aug 15, 2024 02:21 PM IST

AP Haj Tour Notification: హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2025 కు ఆన్‌లైన్ దరఖాస్తు నమోదును ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభించింది. హజ్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పూరించడానికి సెప్టెంబర్ 9వ తేదీ వరకు గడువుగా కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించింది. యాత్రకు వెళ్లాలని భావించే వారు గడువులోగా దరఖాస్తు చేయాలి.

ఏపీ నుంచి హజ్ యాత్రకు దరఖాస్తులు ప్రారంభం
ఏపీ నుంచి హజ్ యాత్రకు దరఖాస్తులు ప్రారంభం

నుంుంచిAP Haj Tour Notification: హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2025 కు ఆన్‌లైన్ దరఖాస్తు నమోదును ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభించింది. హజ్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పూరించడానికి సెప్టెంబర్ 9వ తేదీ వరకు గడువుగా కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించింది. యాత్రకు వెళ్లాలని భావించే వారు గడువులోగా దరఖాస్తు చేయాలి.

హజ్ యాత్ర కోసం దరఖాస్తులు అన్నీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని,నిర్ణీత గడువు ప్రకారం సమయానికి హజ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ సూచించారు.

ప్రతి యాత్రికుడు తన మెషిన్ రీడబుల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ హజ్ దరఖాస్తు ముగింపు తేదీకి ముందే జారీ చేసినదై ఉండాలని, 15-01-2026 వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని మంత్రి వివరించారు. హజ్ యాత్ర చేయడానికి వయో పరిమితి లేదని, శిశువుల ప్రయాణం ఉచితం కాదని,పూర్తి విమాన ఛార్జీలో 10% వసూలు చేస్తారు.

2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న దరఖాస్తుదారుకు పూర్తి ఛార్జీ వసూలు చేస్తారు. హజ్ కమిటీ ఆఫ్ ఇండియాద్వారా హజ్‌కు అర్హత జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉంటుంది. మెహ్రమ్ లేకుండా కేటగిరీలో, 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల స్త్రీలు 4 లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళల సమూహాలలో ప్రయాణించడానికి నిబంధనల ప్రకారం అనుమతించబడతారు. హజ్ 2025 కవర్ సైజులో కనీసం ఒకరు, గరిష్టంగా ఐదుగురు పెద్దలు+ఇద్దరు శిశువులు ఉండవచ్చునని తెలిపారు.

హజ్-2025కు ఎంపికైన హజ్ యాత్రికులు మెడికల్ స్క్రీనింగ్ మరియు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. యాత్రికులు ఎంబార్కేషన్ పాయింట్‌కి ప్రాధాన్యతా క్రమంలో రెండు ప్రాధాన్యతలను ఇవ్వాల్సి ఉంటుంది. యాత్రికుల బస వ్యవధి 40-45 రోజుల వరకు ఉండవచ్చు.

హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2024 నుండి ప్రత్యేక 'హజ్ సువిధ' యాప్‌ను ప్రారంభించింది. దరఖాస్తుల పరిశీలన యాత్రకు సంబంధించి ఇతర వివరాలను తెలియజేయడం,యాత్రకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పన విషయాలు తెలియపరిచేందుకు సులభతరం చేయడం కోసం భారతీయ హజ్ చేపట్టిన చర్యలతో యాత్రికులకు ఎక్కువ సౌలభ్యం,సౌకర్యాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

సమాచార సాంకేతికతను ఉపయోగించాలనే లక్ష్యంతో ఆన్లైన్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు దరఖాస్తుదారులు హజ్ కమిటీ సైట్ https://www.hajcommittee.gov.in/ లేదా https://apstatehajcommittee.com/ లో ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. O/o A.P. రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా సహాయాన్ని, వ్యక్తిగతంగా లేదా టోల్ ఫ్రీ నెం.1800-4257873, 0866- 2471786 లేదా మెయిల్ ద్వారా: aphajcommittee@gmail.com నుంచి మరిన్ని వివరాలు పొందవచ్చునని తెలిపారు.ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులు అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్ ఎమ్ డి ఫరూక్ కోరారు.