Visakha Kite Thread: చైనా మాంజా చుట్టుకుని విశాఖలో చిన్నారికి గాయాలు
Visakha Kite Thread: చైనా మాంజా బారిన పడి హైదరాబాద్‌లో ఆర్మీ జవాను మరణించిన ఘటన మరువక ముందే విశాఖలో మరో ఘటన జరిగింది. ఆర్కే బీచ్‌లో గాలి పటం మాంజా మెడకు చుట్టుకుని బాలిక తీవ్రంగా గాయపడింది.
Visakha Kite Thread: విశాఖపట్నం ఆర్కే బీచ్ లో గాలి పటం మాంజా దారంతో చిన్నారికి తీవ్ర గాయాలపాలైంది. 7ఏళ్ల చిన్నారి ప్రణతి గొంతుకు చైనా మాంజా గొంతు పై తగిలి తీవ్ర గాయమైంది. బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. చిన్నారికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు గుర్తించారు.
బాధితురాలు కంచరపాలెం బర్మా క్యాంప్ ఏ.ఎస్.ఆర్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. తండ్రి తో శ్రీనివాస్‌తో కలిసి బాలిక ప్రణతి బీచ్‌కు వస్తుండగా పాండురంగాపురం బీచ్ వద్ద ప్రమాదానికి గురైంది.
బీచ్‌లో మాంజా దారం మెడకు తగిలి చికిత్స పొందుతున్న బాలిక ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. పిల్లల వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో గాయపడిన పాపకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. పీడియాట్రిక్ వైద్యులు, అనస్తీషియా నిపుణులు వెంటనే శస్త్ర చికిత్స చేసి గాయాలకు కుట్లు వేసినట్లు తెలిపారు. బాలికకు ెలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు తెలిపారు.
మెడకు గాయమైందని, తక్కువ లోతులో గొంతు తెగడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిందని చెప్పారు. హైదరాబాదులో విశాఖకు చెందిన ఆర్మీ ఉద్యోగి ఘటన మరువక ముందే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రమాదకరమైన మాంజా దారాల వినియోగాన్ని నిషేధించాలన్నారు. వాటిని బ్యాన్ చేయాలని గాయపడిన బాలిక తండ్రి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బాలికకు 20కుపైగా కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు.
కంచరపాలెం నుంచి మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో బీచ్‌కి వచ్చామని, రెండున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది చెప్పారు. ఆటోలో పాపను కేజీహెచ్ తరలించామని చెప్పారు. చైనా మాంజా దారాలను బ్యాన్ చేయాలని, ప్రమాదకరమైన దారాలతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయన్నారు. పండగ పూట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం అన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి కోరారు.