Anna Canteens: సెప్టెంబర్ 21 కల్లా ఏపీలో 203 అన్నా క్యాంటీన్లు, చురుగ్గా ఏర్పాట్లు-203 anna canteens in ap by september 21 minister narayana review ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anna Canteens: సెప్టెంబర్ 21 కల్లా ఏపీలో 203 అన్నా క్యాంటీన్లు, చురుగ్గా ఏర్పాట్లు

Anna Canteens: సెప్టెంబర్ 21 కల్లా ఏపీలో 203 అన్నా క్యాంటీన్లు, చురుగ్గా ఏర్పాట్లు

Sarath chandra.B HT Telugu
Jun 28, 2024 06:47 AM IST

Anna Canteens: రాష్ట్రంలోని 203 అన్న క్యాంటీన్ లను వంద రోజుల్లోగా తిరిగి ప్రారంభించాలనే లక్ష్యానికి అనుగుణంగా కార్యచరణ రూపొందించాలని మంత్రి మంత్రి నారాయణ అధికారుల్ని ఆదేశించారు.

అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై సమీక్షిస్తున్న మంత్రి నారాయణ
అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై సమీక్షిస్తున్న మంత్రి నారాయణ

Anna Canteens: ఏపీలో సెప్టెంబర్ 21వ తేదీక నాటికి 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ అధికారుల్ని ఆదేశించారు.

yearly horoscope entry point

పురపాలక - పట్టణాభివృద్ధి శాఖలోని పలు విభాగాల శాఖాధిపతులు,సీనియర్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా మా వేషం నిర్వహించారు.. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ సింఘాలతో కలిసి విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో పలు కీలక అంశాలపై అధికారులకు సూచనలు చేశారు..

అన్నా క్యాంటీన్లు

రాష్ట్రంలోని 203 అన్న క్యాంటీన్ లను వంద రోజుల్లోగా తిరిగి ప్రారంభించేలా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందన్న మంత్రి నారాయణ... సెప్టెంబర్ 21వ తేదీ నాటికి అన్న క్యాంటీన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో నిర్మాణం పూర్తయి చిన్నచిన్న రిపేర్లు ఉన్న 183 క్యాంటీన్ల భవనాల మరమ్మత్తులకు అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

నిర్మాణాలు పూర్తి కావలసిన మరో 20 అన్న క్యాంటీన్ భవనాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేయడంతోపాటు ఆహారం సరఫరా చేసేందుకు అవసరమైన సర్వీస్ ప్రొవైడర్ ను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని ఆదేశించారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ కోసం కమిటీ నియమించాలని సూచించారు.

పట్టణాభివృద్ధి సంస్థల ఆర్థిక పరిస్థితుల గురించి వివరాలు తీసుకున్న మంత్రి నారాయణ... రెవిన్యూ పెంపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. ఆయా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ పరిధిలో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు,డెవలపర్లు కచ్చితంగా నిబంధనలను పాటించేలా చూడాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధనలను అధ్యయనం చేయాలని పట్టణ ప్రణాళికా శాఖ డైరెక్టర్ కు నారాయణ సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భవనాల అనుమతుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో లేఅవుట్ల అనుమతుల విషయంలో వస్తున్న ఫిర్యాదులపై కమిటీ నియమించారు.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా పట్టణాల్లోని మహిళలకు ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని మెప్మా అధికారులకు మంత్రి నారాయణ సూచించారు. పట్టణాల్లో మహిళలను అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చే విధంగా వారి జీవనోపాధికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించవచ్చు అనే దానిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మెప్మా డైరెక్టర్ కు సూచించారు.

రోజువారీగా కాలువల డీసిల్టింగ్‌ను పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఉపయోగించాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. సరైన క్లోరినేషన్‌ చేసిన తర్వాత తాగునీటి సరఫరా చేయాలని, మంచినీటి సరఫరా లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు.నీటి సరఫరా నమూనాలు ప్రతిరోజూ నాణ్యత కోసం పరీక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Whats_app_banner