Pending Cases | ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షల పెండింగ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు, దిగువ కోర్టుల్లో కలిపి నవంబరు, 2021 నాటికి సుమారు 10 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.హైకోర్టుల్లో 2.20 లక్షల మేర, దిగువ కోర్టుల్లో 7.72 లక్షల మేర కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
Pending Cases.. ఆంధ్రప్రదేశ్‌లోని దిగువ కోర్టుల్లో మొత్తం పెండింగ్ కేసులు 7.72 లక్షలు ఉండగా, వీటిలో 4,15,676 సివిల్ కేసులు.. 3,56,476 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
మొత్తం కేసుల్లో ఒరిజినల్ కేసులు సుమారు 83 శాతం ఉండగా, 5 శాతం కేసులు అప్పీలుకు సంబంధించినవి. మొత్తం కేసుల్లో మిసలేనియస్ క్రిమినల్ అప్లికేషన్లు 73.44 శాతం ఉండగా, బెయిల్ అప్లికేషన్లు 17.55 శాతం ఉన్నాయి.
మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో కేసులు
మొత్తం కేసుల్లో 3.35 లక్షల కేసులు ఏడాది లోపు కేసులు కాగా, ఇది 43.48 శాతానికి సమానం. పెండింగ్ కాలం మూడేళ్ల లోపు ఉన్న కేసులు సుమారు 35 శాతం ఉన్నాయి.
3 నుంచి ఐదేళ్ల లోపు పెండింగ్‌లో ఉన్న కేసులు దాదాపు 14 శాతం ఉన్నాయి. అలాగే ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య కాలానికి పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య సుమారు 7 శాతంగా ఉంది.
ఇక పదేళ్ల నుంచి ఇరవై ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 6,278గా ఉంది. ఇది మొత్తం కేసుల్లో 0.81 శాతానికి సమానం. 20 నుంచి 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 345 గా ఉంది. ఇది మొత్తం కేసుల్లో 0.04 శాతానికి సమానం. ఇక 30 ఏళ్లకు పైగా 64 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది కేవలం 0.01 శాతానికి సమానం.
హైకోర్టులోనూ 2.20 లక్షల కేసుల పెండింగ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం 2,20,051 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో సివిల్ కేసులు 1,87,563 కాగా, క్రిమినల్ కేసులు 32,488 పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో 42,545 కేసులు ఏడాదిలోపు కేసులు కాగా, ఒకటి నుంచి మూడేళ్ల కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు 46,674 ఉన్నాయి. ఐదు నుంచి పదేళ్ల మధ్య 57,913 కేసులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
పది నుంచి ఇరవై ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులు సంఖ్య 32,368, ఇరవై నుంచి ముప్పై ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 2,613గా ఉంది. ఇక ముప్పై ఏళ్లకు పైబడి పెండిగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 630గా ఉంది.
పెండింగ్ కేసుల్లో సీనియర్ సిటిజెన్లకు సంబంధించిన పిటిషన్లు 18,899 పెండింగ్‌లో ఉండగా, మహిళలవి 7,706 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో 56 లక్షల 47 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 15.69 లక్షల క్రిమినల్ కేసులు ఉండగా, 40.77 లక్షల సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
సంబంధిత కథనం