తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Revanth Reddy Dance: గిరిజనులతో కలిసి రేవంత్ రెడ్డి డాన్స్

Revanth reddy Dance: గిరిజనులతో కలిసి రేవంత్ రెడ్డి డాన్స్

09 February 2023, 15:29 IST

  • TPCC Revanth Reddy Hath Se Hath Jodo Yatra: రేవంత్ రెడ్డి పాదయాత్ర మహబూబాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. పలువర్గాల సమస్యలను తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. మరోవైపు యాత్ర చేస్తున్న రేవంత్ కు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. పార్టీకి చెందిన గిరిజన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి స్టెప్పులు వేశారు. స్వయంగా డాన్స్ చేసి కార్యకర్తల్లో జోష్ ను నింపారు. ఎల్లంపేట స్టేజీ తండాలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.కుడియా,ఇస్లా తండాకు చెందిన పత్తి రైతులతో మాట్లాడారు. మరిపెడలో ఎస్టీ మినీ గురుకులంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకున్నారు. గేటుకు తాళం ఉండటంతో గోడ దూకి వెళ్లి మరీ విద్యార్థులను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు తమ సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకువచ్చారు.