Minister Mahmood Ali: కంట్రోల్ తప్పిన హోం మంత్రి.. సెక్యూరిటీ చెంప చెల్లు
06 October 2023, 15:53 IST
- తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ కంట్రోల్ తప్పారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన సెక్యూరిటీ చెంపపై కొట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలను కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా బొకే ఇవ్వటానికి హోం మంత్రి వెళ్లారు. అదే సమయంలో బొకే గురించి తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బొకే గురించి తెలియదని సెక్యూరిటీ గార్డు చెప్పడంతో సహనం కోల్పోయిన మహమూద్ అలీ సెక్యూరిటీ గార్డుపై చేయి చేసుకున్నారు. ఈ సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి మహమూద్ అలీకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చెంపపై కొట్టడంతో సెక్యూరిటీ గార్డ్ షాక్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.