తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Kcr: తెలంగాణలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్ల ఉత్పత్తి

CM KCR: తెలంగాణలో ఏడాదికి 10 వేల మంది డాక్టర్ల ఉత్పత్తి

15 September 2023, 16:42 IST

  • తెలంగాణలో ఏడాది పది వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నామని, ఇది రాష్ట్రానికే గర్వకారణన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకప్పుడు రాష్ట్ర పరిస్థితిని అవహేలన చేసిన వారు సైతం.. ఆశ్చర్యపోయేలా అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి వ‌ర్చువ‌ల్ విధానంలో 9 మెడిక‌ల్ కాలేజీల‌ను కేసీఆర్ ప్రారంభించారు. నీతి ఆయోగ్ ఇచ్చే హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇండికేట‌ర్స్‌లో 2014లో మ‌న ర్యాంకు 11 వ‌స్థానంలో ఉండేది. ఇప్పుడు దేశంలో 3వ స్థానానికి ఎదిగామని కేసీఆర్ తెలిపారు. ప్రైవేటు ఆస్ప‌త్రుల దోపిడీ నుంచి ప్ర‌జ‌లు ర‌క్షించ‌బ‌డ్డారని అన్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన స‌మాజం త‌యారు కావాలన్నదే ప్ర‌ధాన లక్ష్య‌మ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.