తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vikarabad: అనంతగిరి అడవిలో రేసింగ్‌ అలజడి.. వీడియో వైరల్

vikarabad: అనంతగిరి అడవిలో రేసింగ్‌ అలజడి.. వీడియో వైరల్

16 August 2023, 14:00 IST

  • పచ్చని ప్రకృతి, ఆధ్యాత్మికతకు నిలయం అనంతగిరి కొండలు. సెలవులు వస్తే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రాంతాన్ని చూసేందుకు వస్తుంటారు. అయితే యువత వికృత చేష్టలతో అనంతగిరికి కుటుంబసభ్యులతో కలిసి పోవాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 15 సెలవు కావడంతో వేలాది మంది పర్యాటకులు అనంతగిరికి వచ్చారు. కొంత మంది యువత అనంతగిరి వ్యూ పాయింట్ల వద్ద బైక్‌ రేసులు, కారు రేసులతో అలజడి సృష్టించారు. అక్కడికి వచ్చిన వారు అది చూసి ఆందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించే అధికారులు సైతం పట్టించుకోలేదు. అయితే ఇప్పటికైనా అనంతగిరి అడవుల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని, సందర్శకులు కోరుతున్నారు.