mla padi kaushik reddy: కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు బిడ్డా మిత్తితో సహా చెల్లిస్తాం
08 March 2024, 14:04 IST
- కాంగ్రెస్ దౌర్జ్యనంలో నలిగిపోతున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. కొందరు పోలీసులు కావాలనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలీసులకు సంగతి చెబుతామని పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, పోలీసులు ఈ విషయాన్ని గుర్తు పెట్టాలని సూచించారు.