Siddipet District : వీధి కుక్కల దాడి... తప్పించుకునే క్రమంలో బాలుడిని ఢీకొట్టిన RTC బస్సు
30 September 2023, 11:30 IST
- Stray Dog Attack On Boy: సిద్ధిపేట జిల్లాలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. తాజాగా చేర్యాల పట్టణం లోని గాంధీ సెంటర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న 12 సంవత్సరాల అనిశిత్ రెడ్డి అనే బాలుడిని వీధి కుక్కల గుంపు వెంబడించాయి. దీంతో సదరు బాలుడు భయంతో కుక్కల నుంచి తప్పించుకోవాలని పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వేగంగా పరిగెత్తాడు. ఇంతలోనే అటువైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బాలుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్... అత్యవసరంగా బ్రేకులు వేసి ఆపడంతో... బాలుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా లో కూడా రికార్డు అయ్యాయి. గతంలోనూ అనిశిత్... తండ్రి శ్రీకాంత్ రెడ్డిపై కూడా ఇదే ప్రాంతంలో కుక్కలు దాడి చేయడం జరిగింది. ఈ తరహా ఘటనలపై స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.