తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Karampudi Ci Chinna Mallaiah | తలకు రివాల్వర్‌ గురిపెట్టి.. అంతు చూస్తానంటూ సీఐ బెదిరింపులు

karampudi ci chinna mallaiah | తలకు రివాల్వర్‌ గురిపెట్టి.. అంతు చూస్తానంటూ సీఐ బెదిరింపులు

26 March 2024, 15:22 IST

  • పల్నాడు జిల్లా కారంపూడి సీఐ చిన మల్లయ్య టీడీపీ కార్యకర్తపై విరుచుకుపడ్డారు. పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్లో కొందరు టీడీపీ నేతలు టీ తాగుతున్నారు. సీఐ వారి వద్దకు వెళ్లి లాఠీతో విరుచుకుపడ్డారు. ఎందుకు కొడుతున్నారని టీడీపీ నేత ప్రశ్నించగా.. సంగతి తేలుస్తా అని దుర్భాషలాడారు. సర్వీసు రివాల్వర్‌ తీసి రాము తలపై పెట్టి.. పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. దీంతో చప్పిడి రామును స్టేషన్‌ నుంచి బయటకు పంపారు.