తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు..!

ప్రపంచంలోనే తొలిసారిగా భారత్‌లో 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు..!

30 August 2023, 10:15 IST

  • ప్రపంచంలోనే తొలిసారిగా 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారును కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభించారు.టయోటా సంస్థ ఈ కారును రూపొందించింది. పెట్రోల్‌, ఇథనాల్‌ కలిపి ఇంధనంగా వాడుకుని నడిచే వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఇప్పటికే కేంద్రం ఈబీపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు పెట్రోల్‌-ఇథనాల్‌ మిశ్రమ ఇంధనంతో నడిచే వాహనాల్లో ఆ మిశ్రమంలో ఇథనాల్‌ గరిష్ఠ వాటా 83 శాతంగా ఉంటుండగా.. గడ్కరీ లాంచ్‌ చేసిన కారుకు 100 ఇథనాల్‌నే వినియోగించే అవకాశం ఉంది. ఇథనాల్‌ను చెరకు పంట నుంచి ఉత్పత్తి చేస్తారు. చెరకు పంట ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది.