తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bengaluru Water Crisis: బెంగళూరులో తీవ్రమైన తాగు నీటి కొరత.. కంపెనీల పరిస్థితి ఏంటి?

Bengaluru Water Crisis: బెంగళూరులో తీవ్రమైన తాగు నీటి కొరత.. కంపెనీల పరిస్థితి ఏంటి?

06 March 2024, 13:00 IST

  • Bengaluru: వేసవికి మెుదలైన వారం రోజులకే బెంగళూరులో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్లతో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి సరఫరా చేస్తున్నా ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. దీంతో వందల సంఖ్యలో కాలి బిందెలతో క్యూలైన్లు కాలనీల్లో కనిపిస్తున్నాయి. బోరు బావుల్లోని నీరు కూడా అడుగంటిపోవటంతో సమస్య మరింత తీవ్రమైంది. తన ఇంట్లోని బోరు కూడా ఎండిపోయిందని ఆ రాష్ట్ర డిప్యూటి సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఇక ఈ క్రమంలోనే బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ.. నీటి వృథాను అడ్డుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నీటిని వృథా చేసేవారికి భారీగా జరిమానా విధించాలని నిర్ణయించింది.