తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Venus Mission : శుక్ర గ్రహంపై ఇస్రో పరిశోధనలు.. ఛైర్మన్ సోమనాథ్ వెల్లడి

Venus mission : శుక్ర గ్రహంపై ఇస్రో పరిశోధనలు.. ఛైర్మన్ సోమనాథ్ వెల్లడి

27 September 2023, 17:15 IST

  • భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో శుక్ర గ్రహంపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1 మిషన్ లను విజయవంతం చేసింది ఇస్రో. ఇప్పుడు వీనస్ మిషన్‌ను చేపట్టనుంది. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. వాతావరణం కలిగి, నివాసయోగ్యమైన గ్రహాలు, నక్షత్రాలు, ఎక్సో-ప్లానెట్ల రహస్యాలు ఛేదించే దిశగా దృష్టి సారిస్తామని సోమనాథ్ వివరించారు. ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఒక మిషన్‌, అంతరిక్ష వాతావరణం.. భూమిపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి మరో రెండు ఉపగ్రహాలను సిద్ధం చేసే పనిలో ఉన్నామని చెప్పారు