Noida Twin Towers: ట్విన్ టవర్స్ స్థలంలో ఆలయమా..! కొత్త హౌసింగ్ ప్రాజెక్టా..?
04 September 2022, 12:47 IST
Noida Twin Towers Issue: నోయిడాలోని 100 మీటర్ల ఎత్తైన ట్విన్ టవర్స్ ను క్షణాల వ్యవధిలో నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే మరో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. ఈ ప్రాంతంలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో సూపర్ టెక్ సంస్థ ఉంది. అయితే ఎమరాల్డ్ కోర్ట్ రెసిడెంట్స్ అసోసియేషన్ మాత్రం దీన్ని వ్యతిరేస్తోంది. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెబుతోంది. అయితే ఇక్కడ భారీ ఆలయాన్ని నిర్మించాలనే సూచనలు కూడా వస్తున్నాయని తెలిపింది. వీటన్నింటిపై చర్చించి... ఓ నిర్ణయం తీసుకుంటామని ఎమరాల్డ్ కోర్ట్ రెసిడెంట్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి....