తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Saved The Pigeon | ట్రాఫిక్ సిగ్నల్ వైర్లకు చిక్కుకున్న పావురం, కాపాడిన పోలీస్

Saved the pigeon | ట్రాఫిక్ సిగ్నల్ వైర్లకు చిక్కుకున్న పావురం, కాపాడిన పోలీస్

27 March 2023, 17:25 IST

ట్రాఫిక్ సిగ్నల్ వైర్లకు చిక్కుకొని వేలాడుతున్న పావురాన్ని కాపాడిన ఓ పోలీస్ వీడియో వైరల్ గా మారింది. జైపూర్‌లోని ఓ రోడ్డు చాలా రద్దీగా ఉంది. అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ స్తంభానికి చిక్కుకుని వేలాడుతూ కనిపించింది ఓ పావురం. అదే సమయంలో ఓ ట్రాఫిక్ పోలీస్ అక్కడికి వచ్చారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఓ ఆర్మీ కోచింగ్ సెంటర్ బస్సును ఆపారు. స్థానికుడి సహాయంతో పావురం కాళ్లకు ఉన్న మాంజా తొలగించి పావురాన్ని కాపాడి దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టాడు.