తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  New Parliament Building : కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం చూస్తారా? .. చూసేయండి మ‌రి!

new Parliament building : కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం చూస్తారా? .. చూసేయండి మ‌రి!

10 August 2022, 21:49 IST

new Parliament building : ఢిల్లీలో కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం సిద్ద‌మ‌వుతోంది. న‌వంబ‌ర్‌లోపు నిర్మాణం పూర్తికానుంది. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల‌ను కొత్త భ‌వ‌నంలోనే నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ భ‌వ‌నం నిర్మాణాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. భూకంపాల‌ను త‌ట్టుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు. అలాగే, ఇది పూర్తిగా ఇకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్‌. ఇందులో ప్ర‌ధానంగా మూడు భాగాలుంటాయి. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌, సెంట్ర‌ల్ హాల్‌. 888 స‌భ్యులు కూర్చునేలా లోక్‌స‌భ‌ను, 384 మంది స‌భ్యులు కూర్చునేలా రాజ్య‌స‌భ‌ను, 1272 మందిని అకామ‌డేట్ చేసేలా సెంట్ర‌ల్‌హాల్‌ను డిజైన్ చేశారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..