తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  One Nation One Election: జమిలి దిశగా అడుగు.. దేశమంతా ఒకేసారి ఎన్నికలు ఉండనున్నాయా..?

One Nation One Election: జమిలి దిశగా అడుగు.. దేశమంతా ఒకేసారి ఎన్నికలు ఉండనున్నాయా..?

01 September 2023, 10:09 IST

  • కాంగ్రెస్ పార్టీని కూలదోసి 2014లో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఈ దఫా వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ముహుర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసమే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అంటే దేశంలో మొత్తం ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలు జరుగుతాయి. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి చాలా కాలంగా చర్చజరుగుతోంది. ఇప్పటికే లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ బిల్లుపై అధ్యయనం చేసింది.ఇప్పటి వరకు దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలాలు ముగిస్తే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల ఆర్థిక పరంగానే గాక మరికొన్ని విధాలుగా నష్టం వస్తుందని వాదనలు ఉన్నాయి.