తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  America: అమెరికాలోని లెవిస్టన్‌ సిటీలో కాల్పులు.. 22 మంది మృతి

America: అమెరికాలోని లెవిస్టన్‌ సిటీలో కాల్పులు.. 22 మంది మృతి

26 October 2023, 10:20 IST

  • అగ్రరాజ్యం అమెరికా కాల్పుల మోత మోగింది. ఓ ముష్కురుడు జరిపిన కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికాలోని మైనే, లెవిస్టన్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 22 మంది చనిపోయారు. దాదాపు 60 మందికిపైగా గాయపడ్డారు. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తీవ్రవాది ఈ కాల్పులు జరిపినట్లుగా అమెరికన్ పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు కాల్పులు జరిపిన స్థానంలో రైఫిల్ పట్టుకుని ఉన్న రెండు ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, అతను పరారీలో ఉన్నాడని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఈ ఘటనపై లెవిస్టన్‌లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. నిందితుడు పరారీలో ఉండడం, మళ్లీ కాల్పులకు పాల్పడే అవకాశాలు ఉండడంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైనే స్టేట్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.