Rahul Gandhi on Adani Scam | అదానీ కోల్ స్కామ్ కారణంగానే.. అధిక విద్యుత్ ఛార్జీలు
18 October 2023, 13:04 IST
- అదానీ కోల్ స్కామ్ గురించి భారతీయ మీడియా ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వ్యాపారవేత్త అదానీ బొగ్గు కుంభకోణానికి పాల్పడుతున్నట్లు ఆరోపించిన రాహుల్ గాంధీ.. అధిక విద్యుత్ ఛార్జీలకు ఇదే కారణమన్నారు. ప్రజలకు చెందిన సుమారు 12 వేల కోట్ల రూపాయల ధనాన్ని అదానీ జేబులోకి మళ్లించాలని కేంద్రంపై రాహుల్ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో మీడియా మాట్లాడిన రాహుల్.. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన రిపోర్టుపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి అదానీ సొమ్ము దోచుకుంటున్నారని, ఫైనాన్షియల్ టైమ్స్‌లో వచ్చిన కథనంతో ఏ ప్రభుత్వమైనా దిగిరావాల్సిందే స్పష్టం చేశారు.