Chhattisgarh | 20 ఏళ్లకుపైగా ఆ గ్రామాల్లో నో పోలింగ్.. ఈ సారి డ్రోన్లతో పహారా
07 November 2023, 13:58 IST
- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అధికంగా నక్సల్ ప్రాంతం ఉంది. ఇక్కడి గ్రామాల ప్రజలు పెద్దగా ఎన్నికల పోలింగ్ లో పాల్గొనరు. ఒకవేళ పాల్గొనాలని ఉన్నా నక్సల్స్ ఆపేస్తారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని కరిగుండం, పిడ్మెల్ గ్రామాల్లోని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇందుకు ఎన్నికల అధికారులు, యంత్రాంగం కూడా ప్రోత్సహించి ఏర్పాట్లు చేసింది. దీంతో ఈసారి జరగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు గ్రామాల ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.