తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pok Suffers | చీకట్లో పాక్ ఆక్రమిత కశ్మీర్.. రోడ్లపైకి వేలాదిగా జనం

PoK suffers | చీకట్లో పాక్ ఆక్రమిత కశ్మీర్.. రోడ్లపైకి వేలాదిగా జనం

12 September 2023, 15:51 IST

  • పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. నగదు నిల్వలు తగ్గిపోవటం, అంతర్జాతీయ ద్రవ్యనిధి-IMF నుంచి సాయం అందకపోవటంతో పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. రాజకీయ అస్థిరత ఏర్పడటంతో ప్రజలకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కనీసం తాగటానికి మంచి నీరు కూడా దొరకటం లేదు. ఎడాపెడా వేస్తున్న పన్నులతో చిమ్మ చీకట్లో పాక్ ఆక్రమిత కశ్మీర్-పీఓకే మగ్గుతోంది. దీంతో ప్రజలు ఇక లాభం లేదని, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తీవ్ర తరం చేశారు. వెంటనే పెంచిన పన్నులు తగ్గించాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.