PM Modi | ఇది ఒక బంగారు క్షణం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
21 September 2023, 15:48 IST
- లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇదో బంగారం క్షణం అని ప్రధాని అభివర్ణించారు. సభలోని సభ్యులందరూ ఆ బంగారు క్షణానికి అర్హులని మోదీ అన్నారు. ఈ బిల్లుతో మహిళలు అపూర్వమైన శక్తిగా ఉద్భవిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని కోరారు. ఇక బుధవారం ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది ఇద్దరు సభ్యులు మినహా.. మిగిలిన సభ్యులంతా మహిళ రిజర్వేషన్ బిల్లుకు, మద్దతు తెలిపారు. ఇవాళ ఇదే బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. అక్కడ కూడా ఈ బిల్లుకు ఎటువంటి ఆటంకం లేకుండా గట్టెక్కనుంది.