congress protest | పోలీసులు కాదు.. మోదీ ప్రభుత్వ ప్రైవేటు సైన్యం
15 June 2022, 22:01 IST
ఢిల్లీ పోలీసులు మోదీ ప్రభుత్వ ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోనికి జొరబడి మరీ, నాయకులపై, కార్యకర్తలపై పోలీసులు దాడులు చేశారని మండిపడింది. ఇది గూండాగిరీ కన్నా తక్కువేమీ కాదని వ్యాఖ్యానించింది. అలాగే, ఈడీ ఆఫీస్ ముందు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జి చేశారని, మోదీ ప్రభుత్వ ఆదేశాల మేరకే ఢిల్లీ పోలీసులు గూండాగిరీ చేశారని విమర్శించింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ఈడీ విచారణకు నిరసనగా దేశవ్యాప్తంగా గత మూడు రోజులుగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాయి.