India & China on Arunachal Pradesh | అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వాదనలు
21 March 2024, 11:06 IST
- అరుణాచల్ ప్రదేశ్‌పై పదే పదే చైనా అసంబద్ధ వాదనలు చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ఆ ప్రాంత పర్యటన చేసిన వేళ అది దక్షిణ చైనా భూభాగమని పేర్కొంది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను తాము ఎన్నడూ గుర్తించలేదని కూడా చెప్పుకొచ్చింది. చైనా ప్రకటన నేపథ్యంలో అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది.