రష్యా 'గోల్డ్'పై నిషేధం.. జీ-7 దేశాల నిర్ణయం!
26 June 2022, 21:26 IST
G7 summit : జర్మనీ వేదికగా జరుగుతున్న జీ-7 దేశాల సదస్సులో రష్యాపై ఆంక్షల వర్షం మొదలైంది! రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించేందుకు జీ-7 యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తమ భూభాగంలోకి రష్యా గోల్డ్‌ను అనుమతించకూడదని ఆయా దేశాధినేతలు ఇప్పటికే నిర్ణయించారు. బ్రిటన్, కెనడా, జపాన్, అమెరికా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ రష్యా ఆర్థిక వనరులను కట్ చేసేందుకు ప్రపంచ దేశాధినేతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే రష్యా చమురు దిగుమతులపై నిషేధం విధించారు. చమురు అనంతరం గోల్డ్ నుంచే ఎక్కువ డబ్బులు రాబడుతోంది రష్యా.