తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  'Death To America': `డెత్ టు అమెరికా`.. అఫ్గాన్‌లో అమెరికా వ్య‌తిరేక నిర‌స‌న‌లు

'Death to America': `డెత్ టు అమెరికా`.. అఫ్గాన్‌లో అమెరికా వ్య‌తిరేక నిర‌స‌న‌లు

05 August 2022, 19:38 IST

'Death to America': అఫ్గానిస్తాన్‌లో అమెరికా వ్యతిరేక నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, అల్‌కాయిదా చీఫ్ అల్ జ‌వ‌హిరీ ని కాబూల్ లో అమెరికా డ్రోన్ దాడిలో చంపేయ‌డంపై అఫ్గ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప్రార్థ‌న‌లు ముగిసిన అనంత‌రం, పెద్ద ఎత్తున పౌరులు వీధుల్లోకి వ‌చ్చి నిర‌స‌న తెలిపారు. `డెత్ టు అమెరికా`, `అమెరికా డౌన్ డౌన్‌` అనే బ్యాన‌ర్ల‌, ప్ల‌కార్డుల‌తో వంద‌లాది మంది కాబూల్ వీధుల్లో నిర‌స‌న తెలిపారు. అఫ్గానిస్తాన్‌లోకి వచ్చి అల్ జ‌వ‌హిరీ ని చంపేయ‌డం అఫ్గ‌నిస్తాన్ సార్వ‌భౌమ‌త్వాన్ని అవ‌మానించ‌డ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. పూర్తి వివ‌రాలు ఈ వీడియోలో చూడండి..