Cyclone Michaung | చెన్నై నగరాన్ని వీడని వరద నీరు.. బోట్లలో బాధితుల తరలింపు
06 December 2023, 11:10 IST
- మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కాలనీల్లోని మురికి కాలువలు చిన్నపాటి నదీ ప్రవాహాన్ని తలపిస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకునేందుకు కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బోట్లు, ట్రాక్టర్ల ద్వారా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 9 జిల్లాలపై తుఫాన్ ఎఫెక్ట్ చూపగా.. చెన్నైలో తీవ్ర నష్టం వాటిల్లింది. పునరావాస చర్యలు చేపట్టేందుకు రూ.5 వేల కోట్ల సాయం చేయాలని కేంద్రానికి డీఎంకే విజ్ఞప్తి చేసింది.