air quality in delhi | దేశ రాజధానిలో దుర్భర పరిస్థితి.. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి
03 November 2023, 13:50 IST
- ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. రోజు రోజుకు దిగజారుతున్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాఠశాల విద్యార్థులకు కేజ్రీవాల్ సర్కారు సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం రెండు రోజులపాటు సెలవు ప్రకటించిన ఢిల్లీ విద్యాశాఖ.. పరిస్థితులను సమీక్షించనున్నట్లు తెలిపింది. అటు వాతావరణాన్ని మెరుగుపరిచే చర్యలకు ఢిల్లీ సర్కారు ఉపక్రమించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా 3 విడత ఆంక్షలు విధించాలని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ గురువారం ఆదేశించింది. ఢిల్లీ సహా గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధనగర్‌లో పెట్రోల్‌తో నడిచే బీఎస్-3 ఇంజిన్‌లు, డీజిల్‌తో నడిచే బీఎస్-4 వాహనాలను ఉపయోగించడంపై బ్యాన్ విధించారు. బొగ్గుల కుంపటి, కలపతో వంట చేయడం సైతం నిషేధం అమలులోకి వచ్చింది.