తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  China Tragedy : చైనా ప్లే స్కూల్‌లో దారుణం

China tragedy : చైనా ప్లే స్కూల్‌లో దారుణం

03 August 2022, 19:31 IST

China tragedy : చైనాలో చిన్నారుల ప్లే స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక 48 ఏళ్ల దుండ‌గుడు క‌త్తితో అన్ఫు కౌంటీలోని ఒక ప్లే స్కూల్ లోకి వెళ్లి అక్క‌డి వారిపై దాడికి పాల్ప‌డ్డారు. ఆ దాడిలో ముగ్గురు చ‌నిపోగా, ఆరుగురు తీవ్రంగా గాయ‌పడ్డారు. ఆ త‌రువాత‌, ఆ వ్య‌క్తి అక్క‌డి నుంచి పారిపోయాడు. అత‌డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఆ దాడిలో మ‌ర‌ణించిన వారిలో చిన్నారులు ఉన్నారా? అనే విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. కానీ, స‌హాయ సిబ్బంది ఒక చిన్న పాప‌ను ఎత్తుకుని అంబులెన్స్ వైపు ప‌రిగెత్తుతున్న దృశ్యం ఉన్న వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. సాధార‌ణంగా చైనాలో ఇలాంటి మాస్ వ‌యోలెన్స్ అరుదు. అక్క‌డ మార‌ణాయుధాల‌కు అనుమ‌తి లేదు.