Election 2023 Live: మిజోరాంలో 40, ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ ప్రారంభం
07 November 2023, 10:59 IST
- మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. మిజోరాంలో మెుత్తం స్థానాలకు ఇవాళే పోలింగ్ నిర్వహిస్తుండగా, సమస్యాత్మక ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయాన్నే ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్లకు వచ్చారు. భన్‌పురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రం వెలుపల క్యూలో నిల్చొని ఉన్నారు. ఉదయాన్ని పోలింగ్ స్టేషన్ కు వచ్చిన మిజోరాం ముఖ్యమంత్రి జోరంథాంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని 20 సీట్లలో చాలా వరకు నక్సల్స్ ప్రభావిత బస్తర్ డివిజన్‌లోనే ఉన్నాయి. మొత్తం 20 సీట్లలో 12 స్థానాలు షెడ్యూల్డ్ తెగలకు, ఒకటి షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి రిజర్వ్ చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిజోరాంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.