తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Drones In Healthcare Services | వైద్య రంగంలోకి డ్రోన్ సేవలు.. విజయవంతంగా టెస్ట్ రన్

Drones in Healthcare Services | వైద్య రంగంలోకి డ్రోన్ సేవలు.. విజయవంతంగా టెస్ట్ రన్

Published Jan 24, 2024 12:14 PM IST

  • భారతీయ వైద్య రంగంలోకి డ్రోన్లు వచ్చేస్తున్నాయి. సేవలు మరింత వేగంగా నడిపేందుకు డ్రోన్లు సహాయ పడనున్నాయి. ఇందుకు ట్రైల్ రన్ నిర్వహించారు ఎయిమ్స్ భువనేశ్వర్ బృంద సభ్యులు. భువనేశ్వర్ నుంచి తంగిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వరకు డ్రోన్ ద్వారా రెండు కిలోలు ఉన్న రక్తాన్ని పంపారు. ఇది 120 కిలోమీటర్ల దూరం ఉంది. కేవలం గంటా పది నిమిషాల్లో ఈ దూరాన్ని డ్రోన్ చేరుకుంది. గ్రామీణ ప్రాంతాలు, వేగవంతంగా సేవలు అందించే క్రమంలో ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని ఎయిమ్స్ ప్రతినిధులు తెలిపారు.