తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jaipur Cng Tanker Accident: ఘోర ప్రమాదం.. బూడిదైపోయిన ఐదుగురు వ్యక్తులు

Jaipur CNG tanker Accident: ఘోర ప్రమాదం.. బూడిదైపోయిన ఐదుగురు వ్యక్తులు

20 December 2024, 13:14 IST

  • రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం జైపూర్‌లోని అజ్మీర్‌ రోడ్డులో ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న CNG ట్యాంకర్‌ను మరో ట్రక్‌ ఢీ కొట్టింది. దీంతో ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించడంతో వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో 24 మందికి పైగా గాయపడ్డారు.