తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ పాదయాత్రలో భాగంగా సరదాగా గంగవ్వను కలిసిన సీతక్క

రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ పాదయాత్రలో భాగంగా సరదాగా గంగవ్వను కలిసిన సీతక్క

07 March 2023, 17:44 IST

  • తెలుగు రాష్ట్రాల్లో గంగవ్వ అంటే తెలియని వారు దాదాపు ఎవరూ ఉండరు. యూట్యూబ్‌లో 'మై విలేజ్ షో' ఛానెల్ ద్వారా పాపులర్ అయిన ఆమె.. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించి సెలబ్రెటీగా మారిపోయింది. టాలీవుడ్‌లో ఎంతోమంది నటీనటులు కూడా గంగవ్వకు అభిమానులుగా మారిపోయారంటే.. ఆమె ఎంతగా అందరినీ తన మాటలతో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్కను గంగవ్వ కలిశారు. ఈ వీడియో చాలా సరదాగా ఉండటంతో వైరల్‌గా మారింది. నువ్వు ఒక పెద్ద నక్సలైట్‌వు అట కదా అని సీతక్కను గంగవ్వ అనగా.. నీది కూడా కరీంనగర్‌లో నక్సలైట్ రాజ్యమే.. నువ్వు పోరాటం చేయలేదా' అంటూ సీతక్క సరదాగా వ్యాఖ్యానించారు.