తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ok Google | వాటిని కంట్రోల్ చేయండి.. లేదంటే పిల్లలు కంట్రోల్‌లో ఉండరు!

OK Google | వాటిని కంట్రోల్ చేయండి.. లేదంటే పిల్లలు కంట్రోల్‌లో ఉండరు!

29 September 2022, 19:38 IST

  • ఒకప్పుడు ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరంను ఆపరేట్ చేయాలంటే వాటికి ఇచ్చిన బటన్లను నొక్కాల్సి వచ్చేది. తర్వాతి కాలంలో రిమోట్ కంట్రోల్ వచ్చింది, దూరం నుంచే ఆపరేట్ చేసే వెసులుబాటు కలిగింది. ఇప్పుడైతే ఆ రిమోట్ వాడకం కూడా తగ్గిపోయి ఓకే గూగుల్, అలెక్సా.., హే సిరి అనే పరిస్థితి వచ్చింది. కేవలం వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, మనం చెప్పిన పని అదే చేసేస్తుంది. రేపటి కాలంలో ఇంకేం వస్తుందో తెలీదు. మనం ఫీలింగ్స్ అర్థం చేసుకొని అందుకు తగినట్లుగా పనులు చేసే టెక్నాలజీ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇప్పటితరం పిల్లలు పూర్తిగా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌కు అలవాటు పడిపోతున్నారు. అయితే దీర్ఘకాలం పాటు ఇటువంటి వాయిస్-నియంత్రణ స్మార్ట్ పరికరాలు ఉపయోగించటం వలన పిల్లల్లో సామాజిక, భావోద్వేగ అభివృద్ధి కుంటుపడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఎదిగే పిల్లల మెదళ్లపై అధునాతన AI, వాయిస్ కమాండ్ ఫీచర్లు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకునేందుకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు రీసెర్చ్ చేశారు. ప్రస్తుతం పిల్లలకు బోధన, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో మంచి స్నేహితులుగా ఉన్న ఈ వాయిస్ కమాండ్ డివైజ్‌లు, భవిష్యత్తులో వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.