Hindu Temples in Pakistan | పాకిస్తాన్‌లోని హిందూ దేవాలయాలకు ఇక పునర్వైభవం..!
04 August 2022, 18:53 IST
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో 1,200 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత హిందూ సంఘాలకు విజయం దక్కింది. ఆలయంలో తిష్టవేసిన అక్రమ నివాసితులను ఖాళీ చేయించాలని పాక్ కోర్టు అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత నెలలో ఫెడరల్ బాడీ ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) లాహోర్ నగరంలో ప్రసిద్ధ అనార్కలి బజార్ సమీపంలో ఉన్న వాల్మీకి మందిర్‌ను అక్రమంగా ఉంటున్న క్రైస్తవ కుటుంబం నుంచి స్వాధీనం చేసుకుంది. రానున్న రోజుల్లో 'మాస్టర్ ప్లాన్' ప్రకారం వాల్మీకి ఆలయాన్ని పునరుద్ధరించనున్నట్లు ఈటీపీబీ అధికార ప్రతినిధి అమీర్ హష్మీ పీటీఐకి తెలిపారు. దీనితో పాటు కృష్ణ దేవాలయంను కూడా పునరుద్ధరించనున్నారు. విభజన తర్వాత సిక్కులు, హిందువులు భారతదేశానికి వలస రావటంతో అక్కడ హిందూ దేవాలయాలు, భూములను ETPB పర్యవేక్షిస్తుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.