తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Britain Boils | హాట్ బ్రిటన్‌గా మారిన గ్రేట్ బ్రిటన్, చల్లని దేశం ఉడుకుతోంది!

Britain Boils | హాట్ బ్రిటన్‌గా మారిన గ్రేట్ బ్రిటన్, చల్లని దేశం ఉడుకుతోంది!

19 July 2022, 20:45 IST

  • యునైటెడ్ కింగ్‌డమ్ ఇక ఎంతమాత్రం చల్లని దేశం కాదు. బ్రిటన్‌లో ఉష్నోగ్రతలు మొట్టమొదటిసారిగా 40C (104F) మార్కును తాకాయి. ఒకప్పుడు శీతల దేశంగా భావించిన యూరోప్‌లో ఇప్పుడు హీట్‌వేవ్ తీవ్రతరం అయింది. పొలాలు కాలిపోవడం, విమానాశ్రయ రన్‌వేలు, రైలు ట్రాక్‌లను దెబ్బతెనడం జరుతుంది. చరిత్రలోనే తొలిసారిగా 2019లో నమోదైన 38.7C రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైంది. మళ్లీ 2022లో ఈరోజు మంగళవారం మునుపటి రికార్డును అధిగమించిందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఎండలకు తాళలేక బ్రిటన్ వాసులు ఏసీ గదులను విడిచి బయటకు రావటం లేదు. బయట తిరిగేవారు చల్లని పొగమంచు స్ప్రేలను పట్టుకొని తిరుగుతున్నారు. వేడి గాలుల కారణంగా పలు రైలు మార్గాలను మూసివేశారు. సాధారణంగా రద్దీగా ఉండే నగర కేంద్రాలు మనుషుల్లేకుండా నిశ్శబ్దంగా మారాయి. జూలలో జంతువులను చల్లగా ఉంచడానికి స్టాఫ్ కష్టపడుతున్నారు. క్రికెట్ గ్రౌండ్ సభ్యులు ఇకపై జాకెట్ ధరించాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ఏసీల డిమాండ్ పెరిగింది. జాకెట్ల డిమాండ్ తగ్గింది.