తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Self-driving Pods | త్వరలోనే పబ్లిక్ రోడ్లపై సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల పరుగులు!

Self-driving Pods | త్వరలోనే పబ్లిక్ రోడ్లపై సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల పరుగులు!

18 July 2022, 13:28 IST

  • ఇప్పటివరకు డ్రైవర్ రహిత వాహనాలు గురించి వినడమే తప్ప, రోడ్లపై ఎక్కడా చూసింది లేదు. ఇప్పటికీ ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. అయితే అమెరికాలో మాత్రం ఈ డ్రైవర్ రహిత వాహనాలు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ఏవో చిన్నవాహనాలు అనుకునేరు, ఏకంగా భారీ సైజ్ కమర్షియల్ వాహనాలు డ్రైవర్ లేకుండానే పబ్లిక్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. స్వీడిష్ అటానమస్ వెహికల్ స్టార్టప్ అయిన ఐన్‌రైడ్, తాము రూపొందించిన భారీ సెల్ఫ్ డ్రైవింగ్ సెమీ వాహనాలను ఈ ఏడాదిలోనే U.Sలోని పబ్లిక్ రోడ్‌లపై విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) నుంచి అనుమతులు కూడా పొందింది. ఆటోనమస్ ఎలక్ట్రిక్ ట్రాన్స్‌పోర్ట్ (AET) ట్రక్కులు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ పాడ్ ట్రక్కులు అని పిలిచే ఈ వాహనాలు పబ్లిక్ రోడ్‌లపై వాటంతటవే డ్రైవింగ్ చేయడం ప్రారంభిస్తాయి. అయితే వీటిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో ఈ వాహనాలను నియంత్రించడానికి రిమోట్ సిస్టమ్ డ్రైవర్ ద్వారా ఆపరేషన్స్ చేపడతారు. ఈ వాహనాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూడండి.