Scorpio vs Scorpio-N | మహీంద్రా కంపెనీ ద్విముఖ వ్యూహం ఇదే!
06 July 2022, 10:50 IST
లెజెండరీ ఇండియన్ SUV మహీంద్రా స్కార్పియో ఇప్పుడు సరికొత్త అవతార్‌లో Scorpio-Nగా మార్కెట్లోకి తిరిగి వచ్చింది. మహీంద్రా స్కార్పియో ఒకప్పుడు చాలా మంది మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా అందుబాటులో ఉన్న వాహనం. మొట్టమొదటి సారిగా 2002లో లాంచ్ అయిన ఈ SUV వెంటనే మంచి ప్రజాదరణ చూరగొంది. అయినప్పటికీ స్కార్పియోలో సాంకేతికత పరంగా, ప్రీమియం ఫీచర్ల పరంగా కొన్ని లోపాలు కనిపించేవి. ఇప్పుడు ఆ లోపాలను అధిగమిస్తూ 2022లో స్కార్పియో కొత్త రూపంలో పునరాగమనం చేసింది. అయినప్పటికీ పాత వెర్షన్ స్కార్పియో కూడా ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉంది. మరి ఈ విషయంపై మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజయ్ నక్రా.. హెచ్‌టి ఆటోతో ప్రత్యేకంగా మాట్లాడారు. కొత్తగా విడుదల చేసిన స్కార్పియో-ఎన్‌తో పాటు పాత స్కార్పియోను ఎందుకు ఉంచాలని నిర్ణయించుకున్నారు? ఇది ఏమైనా ప్రత్యేకమైన మార్కెటింగ్ వ్యూహంలో భాగమా? అని అడగగా.. జనాలు ఇప్పటికీ పాత వెర్షన్ పై కూడా మక్కువ చూపుతున్నారని ఆయన బదులిచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి.