తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pregnant Woman's Stress । గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. మీరు ఒత్తిడికి లోనయితే ఏం జరుగుతుందో తెలుసా?

Pregnant woman's stress । గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. మీరు ఒత్తిడికి లోనయితే ఏం జరుగుతుందో తెలుసా?

13 September 2022, 17:13 IST

  • గర్భంతో ఉన్న స్త్రీలు ఎల్లప్పుడూ ప్రశాంతగా సమయం గడపాలి. మనసులో ఎలాంటి ఆందోళనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే అది వారికి పుట్టబోయే పిల్లలపైనా ప్రభావం చూపుతుందని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇన్‌ఫాన్సీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే గర్భిణీలకు పుట్టబోయే శిశువులు ఎక్కువ భయం, విచారం, బాధలను కలిగి ఉంటారు. గర్భధారణ సమయంలో తల్లులు వ్యక్తపరిచే బాధలు, గర్భంలోని శిశువుకు సంబంధించినవేనని ఇన్‌ఫాన్సీ జర్నల్‌లో ప్రచురించారు. తల్లులు అనుభవించే ఒత్తిడి వారి బిడ్డల భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాంటి పిల్లలు పెరిగేకొద్దీ ఎలా ప్రవర్తిస్తారు? అనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.