తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Langya Henipavirus | చైనాలో మరో కొత్త వైరస్ వ్యాప్తి.. వ్యాధి లక్షణాలు ఇవే!

Langya Henipavirus | చైనాలో మరో కొత్త వైరస్ వ్యాప్తి.. వ్యాధి లక్షణాలు ఇవే!

11 August 2022, 15:09 IST

చైనాలో మరో కొత్త వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తూర్పు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 35 మంది వ్యక్తులు అనారోగ్యం పాలయ్యారు. వీరిలో తీవ్రమైన జ్వరాన్ని కలిగించే లాంగ్యా హెనిపావైరస్ (LayV) అనే కొత్త వైరస్‌ను వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే అవకాశం ఉంది. ఈ వైరస్ వల్ల తీవ్రమైన జ్వరం, అలసట, దగ్గు, ఆకలి మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. కొంతమంది రోగులకు ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, తలనొప్పి కూడా ఉన్నాయని వారు తెలిపారు. వీరిలో చాలా మందికి కాలేయ పనితీరు కూడా దెబ్బతింది. లాంగ్యా వైరస్ కూడా ప్రాణాంతకమైన నిపా వైరస్, హెండ్రా వైరస్‌ల కుటుంబానికి చెందినది. ఈ హెండ్రా, నిపా వైరస్‌ల కారణంగా సంభవించే మరణాల రేటు దాదాపు 40-70% మధ్య ఉంటుందని అంచనా. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..