Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఫస్ట్ రివ్యూ చూస్తారా?
21 July 2022, 13:02 IST
Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి.. ఇండియన్ మిడిల్‌క్లాస్ కలలు కనే కారు. తక్కువ ధర, మెయింటెనెన్స్‌తో ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్‌ను దశాబ్దాలుగా ఏలుతోంది. ఆ కంపెనీ నుంచి ఏ కొత్త కారు వచ్చినా ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాంటి కంపెనీ తాజాగా గ్రాండ్ విటారా కారును లాంచ్ చేసింది.
ఈ కారు ఫస్ట్ లుక్ రివ్యూని హిందుస్థాన్ టైమ్స్ ఆటో మీ ముందుకు తీసుకొస్తోంది. ఇది మారుతి సుజుకి నుంచి వస్తున్న తొలి మిడ్‌సైజ్ ఎస్‌యూవీ కారు కావడం విశేషం. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లాంటి మోడల్స్‌ను సవాలు చేస్తూ ఈ కారు ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చింది.
గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ముందుగా లుక్‌తోనే ఆకట్టుకుంటోంది. ఈ కారు ఫ్రంట్, బ్యాక్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ఇక బూట్‌స్పేస్ కూడా మీరు ఊహించని రేంజ్‌లో ఉంది. ఈ కారులో లాంగ్ ట్రిప్‌కు భారీ లగేజీతో ఈజీగా వెళ్లొచ్చు. ఈ కారు మారుతి నుంచి వచ్చిన తొలి మిడ్‌సైజ్ ఎస్‌యూవీయే కాదు.. ఈ కంపెనీ తీసుకొచ్చిన తొలి పనారమిక్ సన్‌రూఫ్ ఉన్న కారు కూడా.
ఇంటీరియర్ పరంగా కూడా గ్రాండ్ విటారా లుక్ చాలా బాగుంది. డ్యాష్ బోర్డు గ్రాండ్ లుక్‌తో కనిపిస్తోంది. 9 అంగుళాల స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఆండ్రాయిడ్‌తోపాటు ఆపిల్ కార్‌ప్లేను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ.11 వేలు చెల్లించి ఈ బ్రాండ్ న్యూ గ్రాండ్ విటారాను బుక్ చేసుకోవచ్చు.
హిందుస్థాన్ టైమ్స్ ఆటో త్వరలోనే ఈ గ్రాండ్ విటారా ఫస్ట్ డ్రైవ్ రివ్యూని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది. ఆలోపు ఈ మారుతి సుజుకి నుంచి వచ్చిన తొలి మిడ్‌సైజ్ ఎస్‌యూవీని మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే బుక్ చేసుకోండి.