Maruti Suzuki S-Presso కార్ ఎంతవరకు సేఫ్? క్రాష్ టెస్టులో వచ్చిన ఫలితం ఇదే!
29 June 2022, 21:45 IST
- Maruti Suzuki S-Presso కార్ ఇటీవల ముగిసిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో 3-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఆఫ్రికాలో సురక్షితమైన కార్ల ప్రోగ్రామ్ కింద దీనికి క్రాష్ టెస్ట్ చేశారు. ఈ కారులో భద్రత ప్రమాణాలు స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నట్లు వెల్లడైంది. ఇది మేడ్- ఇన్-ఇండియా కారు. 2019లో మారుతి సుజుకి కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. కాగా, 2020లో జరిగిన క్రాష్ టెస్ట్‌లో ఈ కార్ జీరో రేటింగ్స్ పొందింది. దీంతో దీని ఎగుమతులపై ప్రభావంపడింది. రెండేళ్ల తర్వాత అప్‌డేట్ చేసిన మోడల్‌లో స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు అందజేయడంతో మొత్తానికి క్రాష్ టెస్ట్ పాస్ అయింది. S-ప్రెస్సో కార్ ఇండియాలోనూ సేల్ అవుతోంది. దీని క్రాష్ టెస్టుకు సంబంధించిన విజువల్స్ ఈ వీడియోలో చూడవచ్చు.