తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Janet Jackson's Rhythm Nation। జాగ్రత్త..ఈ పాట విన్నారో, మీ ల్యాప్‌టాప్‌ క్రాష్!

Janet Jackson's Rhythm Nation। జాగ్రత్త..ఈ పాట విన్నారో, మీ ల్యాప్‌టాప్‌ క్రాష్!

30 August 2022, 15:24 IST

  • సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయంటారు, కానీ ఒక పాట వింటే ల్యాప్‌టాప్‌లన్నీ క్రాష్ అవుతాయట. ఇప్పుడు ఈ వార్త అంతర్జాతీయంగా వైరల్ అవుతోంది. US పాప్ స్టార్ జానెట్ జాక్సన్ పాడిన 1989 నాటి పాట ల్యాప్‌టాప్‌లను క్రాష్ చేయగలదని ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ద్వారా వెల్లడైంది. దీని వెనుక ఉన్న సాంకేతికత సైబర్ దాడులకు ఉపయోగపడుతుందని తేలింది. ల్యాప్‌టాప్‌లలో "రిథమ్ నేషన్" అనే పేరు గల మ్యూజిక్ వీడియోను ప్లే చేసినపుడు ఒక విచిత్రమైన సైబర్ దాడిని నిపుణులు కనుగొన్నారు. వారు ఒక ల్యాప్‌టాప్‌లో ఈ మ్యూజిక్ వీడియో ప్లే చేయడం వల్ల సమీపంలోని మరొక ల్యాప్‌టాప్ క్రాష్ అయింది. ఈ పాటలో మేకర్స్ ఉపయోగించిన ఆడియో ఫ్రీక్వెన్సీలు 5400 rpm మోడల్స్ ల్యాప్‌టాప్ హార్డ్ డ్రైవ్‌లను క్రాష్ చేస్తున్నట్లు గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.