Underwater Metro। త్వరలోనే నీటి అడుగున మెట్రో రైల్ పరుగులు, భారతదేశంలోనే మొదటిది
10 August 2022, 19:02 IST
భారతదేశంలోనే నీటి అడుగున మెట్రో రైలును కలిగి ఉన్న మొట్టమొదటి నగరంగా కోల్‌కతా త్వరలోనే రికార్డులకు ఎక్కనుంది. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (KMRC) ఆధ్వర్యంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తూర్పు-పశ్చిమ కారిడార్ (underwater metro) ప్రాజెక్ట్ జూన్ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. హౌరా నుంచి వయా కోల్‌కతా సాల్ట్ లేక్ వరకు వెళ్లే ఈ మెట్రో లైన్ హుగ్లీ నదికి దిగువన నీటి అడుగున ప్రయాణమార్గాన్ని కలిగి ఉంటుంది. డిసెంబరు 2021 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావించినప్పటికీ సొరంగం నిర్మాణ సమయంలో సెంట్రల్ కోల్‌కతాలోని ఒక ప్రాంతంలో ప్రమాదాల కారణంగా ఆలస్యమైంది. భూగర్భంలో చేపట్టిన పనుల కారణంగా అదే ప్రాంతంలో అనేక ఇళ్లకు పగుళ్లు కూడా ఏర్పడ్డాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ పనుల్లో మరింత జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. మొత్తం ప్రాజెక్ట్ పొడవు 16.55 కి.మీ కాగా, ఇప్పటికే 9.30 కి.మీ ట్రాక్ పూర్తయింది. మిగిలిన 7.25 కి.మీ పొడవు ఏడాది లోపు పూర్తి కానుందని నివేదికలు తెలిపాయి. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.