Honda City eHEV | హోండా సిటీ హైబ్రిడ్ వెర్షన్ కార్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
02 May 2022, 8:23 IST
ప్రముఖ హోండా కార్స్ ఇండియా తమ బ్రాండ్ నుంచి హోండా సిటీ మిడ్-సైజ్ సెడాన్ కారులో హైబ్రిడ్ వెర్షన్‌ను అతి త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమైనాయి. ఆసక్తిగలవారు హోండా అధికారిక వెబ్‌సైట్‌లో లేదా పేరుపొందిన హోండా డీలర్‌షిప్‌ల నుంచి రూ. 21 వేలు చెల్లించి ఈ కార్ బుక్ చేసుకోవచ్చు. ఈ కారు పూర్తిగా హైబ్రిడ్ మోడల్. హోండా సిటీ e:HEV సుమారు 26.5 kmpl మైలేజీని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 176 కిమీ. మరి ఈ కారులో షికారుకు వెళ్తే ఎలా ఉంటుంది. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? మొదలగు అన్ని విషయాలకు సంబంధించిన సమాచారాన్ని HT ఆటోమొబైల్ విభాగం స్వయంగా పరీక్షించి మీకు అందిస్తున్న ఫస్ట్ డ్రైవింగ్ రివ్యూని ఈ వీడియోలో చూడండి.